నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
NTR: విద్యుత్ మరమ్మతుల కారణంగా విజయవాడలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. మాచవరం, బీఆర్టీఎస్ రోడ్, కేన్సర్ హాస్పిటల్ ఏరియా, హిందీ కాలేజీ రోడ్, పడవలరేవు, నార్లవారివీధి, కుటుంబరావు వీధి, బుల్లెమ్మ వీధి, కాటూరివారి వీధి, దానయ్య వీధి, తదితర ప్రాంతాల్లో నేడు ఉదయం 8 గంటల నుంచి 10:30 గంటల వరకు సరఫరా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు.