బోయినపల్లిలో పోలీసుల కార్డన్ సెర్చ్

బోయినపల్లిలో పోలీసుల కార్డన్ సెర్చ్

అన్నమయ్య: రాజంపేట మండలం బోయినపల్లిలో మంగళవారం ఉదయం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇంజనీరింగ్ విద్యార్థులు నివాసం ఉంటున్న అద్దె గదులను, వసతి గృహాలను తనిఖీ చేశారు. ఇంజనీరింగ్ విద్యార్థులు వాడుతున్న ద్విచక్ర వాహనాల రికార్డులను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో రాజంపేట ఏఎస్పీ మనోజ్ రాంనాథ్ హెగ్దే, మన్నూరు సీఐ కుళ్లాయప్ప, రాజంపేట సీఐ రాజా పాల్గొన్నారు.