జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్‌లో రాగినేడు విద్యార్థినులు
పెద్దపల్లి జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్‌లో రాగినేడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థినులు విశేష ప్రతిభ కనబరిచారు. ఇన్‌స్పైర్‌లో రెండు, సైన్స్ ఫెయిర్‌లో ఒక ఎగ్జిబిట్ రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు ఎంపికయ్యాయి. రాష్ట్ర స్థాయికి ఇల్లందుల శ్రీనిత్య, పడాల వైష్ణవి ఎంపికయ్యారు. వీరిని మండల విద్యాధికారి సురేందర్ కుమార్, జిల్లా సైన్స్ అధికారి రవీందర్ సన్మానించారు.