అయినవిల్లి మండలంలో భారీ వర్షం

అయినవిల్లి మండలంలో భారీ వర్షం

కోనసీమ: అయినవిల్లి మండలం లో పలు గ్రామాలలో ఆదివారం ఉదయం 11 గంటల నుంచి భారీ వర్షం కురుస్తుంది. ఉదయం నుంచి ఎండగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. దీంతో వాహన దారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారులు బురద మయం అవుతున్నాయి. పల్లపు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి.