'రజక వృత్తిదారులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి'

ప్రకాశం: నాయి బ్రాహ్మణులకు ఇచ్చినట్లుగానే రజక వృత్తిదారులకు కూడా 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును ప్రభుత్వం ఇవ్వాలని జిల్లా రజక వృత్తిదారుల సంఘం ప్రధాన కార్యదర్శి రాయల్ల మాలకొండయ్య డిమాండ్ చేశారు. రజక వృత్తిదారుల సమస్యలపై ఈనెల 25న ఒంగోలు కలెక్టరేట్ వద్ద ధర్నాను విజయవంతం చేయాలని రజక పాలెంలో గురువారం ఆయన ప్రచారాన్ని నిర్వహించారు.