డీకే, సిద్ధరామయ్య వర్గాల మొండిపట్టు..!
కర్ణాటకలో కేబినెట్ బెర్తుల కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వర్గాల మధ్య సయోధ్య కుదరడం లేదు. కీలక బెర్తుల కోసం రెండు వర్గాలు మొండిపట్టుతో ఉన్నాయి. మంత్రి పదవుల కోసం తాను ఎమ్మెల్యేలను ఆపనని డీకే శివకుమార్ స్పష్టం చేశారు. దీంతో ఈ గందరగోళాన్ని పరిష్కరించాలని కోరుతూ సిద్ధరామయ్య కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో, ఖర్గే బెంగళూరుకు చేరుకున్నారు.