ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందజేసిన MLA
WGL: అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత క్రమంలో దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని పరకాల MLA రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. GWMC 17వ డివిజన్ పరిధిలో అర్హులైన 43 మంది లబ్ధిదారులకు బుధవారం MLA ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. పేదల సొంతింటి కల కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో నెరవేరుతోందని ఎమ్మెల్యే తెలిపారు.