రైతుల సమస్యలపై వినతి పత్రం
SKLM: ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్ముకొందామంటే పడరాని పాట్లు పడుతున్న రైతాంగాన్ని ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సిర్ల ప్రసాద్ డిమాండ్ చేశారు. శుక్రవారం కొత్తూరు మండల తహసీల్దార్ కార్యాలయం అధికారులకు రైతులతో కలిసి వినతిపత్రం అందజేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.