మాచుపల్లిలో వైభవంగా గంగమ్మ జాతర

మాచుపల్లిలో వైభవంగా గంగమ్మ జాతర

KDP: సిద్ధవటం మండలంలోని మాచుపల్లి గ్రామంలో ఆదివారం స్థానిక ప్రజలు గంగమ్మ జాతరను వైభవంగా నిర్వహించారు. జాతర సందర్భంగా గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు అమ్మవారికి బోనాలు, కాయకర్పూరం సమర్పించారు. మరికొందరు కోడిపుంజులు, మేకపోతులు బలిచ్చి మొక్కుబడులు చెల్లించుకున్నారు.