సత్తెనపల్లిలో ఆలయాల హుండీలు లూఠీ

సత్తెనపల్లిలో ఆలయాల హుండీలు లూఠీ

PLD: సత్తెనపల్లిలో దొంగలు రెచ్చిపోయారు. పట్టణంలోని ప్రసిద్ధ శివాలయం, వేణుగోపాల స్వామి ఆలయాల్లో అర్ధరాత్రి చోరీ జరిగింది. దుండగులు హుండీలను కటర్లతో కట్ చేసి సుమారు రూ.1.30 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. చోరీ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. దేవాదాయ శాఖ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు.