తెనాలి వైకుంఠపురం ఆలయం మూసివేత

తెనాలి వైకుంఠపురం ఆలయం మూసివేత

GNTR: తెనాలిలోని శ్రీలక్ష్మీ పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి వారి వైకుంఠపురం దేవస్థానం ఇవాళ మధ్యాహ్నం మూసివేశారు. రాత్రి నుంచి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా మధ్యాహ్నం అనంతరం స్వామి వారికి మహా నైవేద్యం సమర్పించి ఆలయ తలుపులను మూసివేసినట్లు అర్చకులు సత్యనారాయణ గౌతమ్, అళహరి రవికుమార్ తెలిపారు. తిరిగి సోమవారం ఉదయం ఆలయ సంప్రోక్షణ చేసిన తెరవనున్నట్లు వెల్లడించారు.