IPL: రికార్డు సృష్టించిన సునీల్ నరైన్

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా CSKతో మ్యాచ్‌లో KKR ప్లేయర్ సునీల్ నరైన్ రికార్డు సృష్టించాడు. ఒకే ప్లేయర్ బౌలింగ్‌లో 50కి పైగా బందులు ఎదుర్కొని అత్యధిక స్ట్రైక్ రేట్ (244.44)తో బ్యాటింగ్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. అతడు అశ్విన్ బౌలింగ్‌లో 54 బంతులు ఎదుర్కొని 132 పరుగులు చేశాడు. నరైన్ తర్వాత పొలార్డ్ (223 SR) 51 బంతుల్లో 114 పరుగులు చేశాడు.