పేరుకుపోయిన చెత్త.. పట్టించుకోని అధికారులు

పేరుకుపోయిన చెత్త.. పట్టించుకోని అధికారులు

RR: షాద్ నగర్‌లో 2BHK ఇళ్ల నిర్మాణం పూర్తిచేసుకుని ఏళ్లు గడుస్తున్నా అవి లబ్ధిదారులకు చేరకుండా నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. దీంతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో చెత్తను పారబోస్తుండడంతో గుట్టలు గుట్టలుగా చెత్త పేరుకుపోయింది. 2BHK ఇళ్లను కట్టి వదిలేసారని, వాటిని పట్టించుకునే నాధుడే కరువయ్యాడని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరుతున్నారు.