బద్దిపోచమ్మ దేవస్థానికి పోటెత్తిన భక్తులు
SRCL: ప్రసిద్ధ పుణ్య క్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి అనుబంధ ఆలయమైన శ్రీ బద్దిపోచమ్మ దేవస్థానికి గురువారం భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు, అమ్మవారికి మొక్కులు చెల్లించేందుకు తెల్లవారుజాము నుంచే క్యూలైన్లో బారులు తీరారు. పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు రావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది.