'పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి'

'పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి'

SRD: అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని జన జాగృతి సేన అధ్యక్షుడు కృష్ణ డిమాండ్ చేశారు. సంగారెడ్డి మండలం ఇరిగిపల్లి గ్రామంలో అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంట పొలాలను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఎకరానికి 20 వేల రూపాయల పరిహారం ఇవ్వాలని కోరారు. లేకుంటే ఆందోళన చేస్తామని చెప్పారు.