'వైద్య విద్యార్థులు ర్యాగింగ్ కు దూరంగా ఉండాలి'

ADB: వైద్య విద్యార్థులు ర్యాగింగ్ నుంచి దూరంగా ఉండాలని ఆదిలాబాద్ రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాథోడ్ జైసింగ్ సూచించారు. ఈ ఏడాది ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్‌లో చేరిన విద్యార్థులకు ఆడిటోరియంలో ఓరియంటేషన్ సమావేశాన్ని నిర్వహించారు. విద్యార్థులు తమని తాము పరిచయం చేసుకున్నారు.