ఆంజనేయస్వామి ఆలయంలో కార్తీక దీపోత్సవం
MDK: శివంపేట మండలం చాకరిమెట్ల శ్రీ సహకార ఆంజనేయస్వామి ఆలయంలో కార్తీక దీపోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు. ఆలయ వ్యవస్థాపక ఛైర్మన్ ఆంజనేయ శర్మ, ఈవో సార శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్తీకమాసం దీపోత్సవాలను నిర్వహించారు. సోమవారం రాత్రి నిర్వహించిన దీపోత్సవంతో ఆలయ ప్రాంగణం దీపాల వెలుగులో వెలిగిపోయింది.