రావులకొల్లులో పొలం పిలుస్తుంది కార్యక్రమం

ప్రకాశం: పొన్నలూరు మండలంలోని రావులకొల్లు గ్రామంలో శుక్రవారం ఏవో రాము ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి కౌలు రైతు గ్రామ రెవిన్యూ అధికారుల వద్ద తమ పేర్లను నమోదు చేసుకొని కౌలు కార్డు పొందాలని ఏవో పేర్కొన్నారు. కౌలు కార్డు పొందడం ద్వారా ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం అయితే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుందని తెలిపారు.