బీజేపీ ఆధ్వర్యంలో మహాధర్నా

BHNG: బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో బీబీనగర్ మండలంలోని రుద్రవెల్లి బ్రిడ్జి వద్ద మహాధర్నా నిర్వహించారు. బీబీనగర్ - భూదాన్ పోచంపల్లి మార్గమధ్యంలో రుద్రవెల్లి వద్ద మూసీ నదిపై నిర్మించనున్న బ్రిడ్జినీ త్వరగా పూర్తి చేయాలని పార్టీ మండల అధ్యక్షుడు సదానందం గౌడ్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కొప్పుల యాదిరెడ్డి, మైసయ్య పాల్గొన్నారు.