అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

NRPT: ధన్వాడ మండల కేంద్రంలో ఆదివారం వాహనాలను తనిఖీ చేస్తుండగా దేవరకద్ర నుంచి నారాయణపేటకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. దేవరకద్రకు చెందిన ఎరుకలి వెంకట్రాములపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుమన్నారు. సుమారు 15 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకొని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగిందన్నారు.