'పనులను 20 రోజుల్లో పూర్తిచేయాలి'

'పనులను 20 రోజుల్లో పూర్తిచేయాలి'

VSP: స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియం పునర్నిర్మాణ పనులు ఆలస్యంగా సాగుతున్నందుకు కమిషనర్ కేతన్ గార్గ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సివిల్, ఏసీ, ఫ్లోరింగ్, పెయింటింగ్, విద్యుత్ తదితర పనులను 20 రోజుల్లో పూర్తిచేయాలని ఇంజనీర్లు, గుత్తేదారులకు ఆదేశించారు. పెండింగ్ పనులపై వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని స్పోర్ట్స్ విభాగాన్ని మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.