సేంద్రియ సాగుపై వెబినార్
W.G: వెంకటరామన్నగూడెం ఉద్యాన విశ్వవిద్యాలయంలో సోమవారం సేంద్రియ సాగుపై వెబినార్ నిర్వహించారు. గ్లోబల్ ఆర్గానిక్ ఫుడ్ మార్కెట్ రూ.500 బిలియన్లకు చేరిందని ఐఫోమ్ ఆసియా డైరెక్టర్ డా. షైక్ తన్వీర్ హుస్సేన్ తెలిపారు. 2030 నాటికి 13 శాతం వృద్ధిరేటుతో ఈ రంగం విస్తరించనుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వీసీ ధనుంజయ్ సహా పలువురు నిపుణులు పాల్గొన్నారు.