రూ.20 కోట్ల పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా

రూ.20 కోట్ల పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా

RR: గండిపేట మండలంలోని మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీవెంకటేశ్వర కాలనీలో కొందరు అక్రమంగా ఆక్రమించిన సుమారు రూ.20కోట్ల విలువైన పార్కు స్థలాన్ని హైడ్రా అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగి అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఈ అధికారులు స్థలంలో బోర్డును ఏర్పాటు చేశారు.