పేదరికాన్ని జయించి విజయం
NLG: నోములకి చెందిన జటంగి అనూష ఇంటర్‌లో 1000/992 మార్కులు సాధించి సత్తా చాటింది. నిరుపేద కుటుంబం కావడంతో గ్రామస్థులు, ఉపాధ్యాయుల ఆర్థిక సహకారంతో నల్గొండలో చదివి ఈ ఘనత సాధించింది. ప్రతిభ కనబరిచిన అనూషను గ్రామస్థులు అభినందించారు. తన భవిష్యత్ చదువులకు దాతలు చేయూతనివ్వాలని ఆమె తల్లిదండ్రులు కోరుతున్నారు.