సబ్ స్టేషన్‌కు కేవీ లైన్ ఏర్పాటు

KMM: కల్లూరు మండలం బత్తుపల్లి సబ్ స్టేషన్ కు రూ.39 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన 33/11 కేవీ లైన్‌ను ఎస్ఈ శ్రీనివాసాచారి బుధవారం ప్రారంభించి మాట్లాడారు. ఈ లైన్‌తో పది గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు ఉండవని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో డీఈ లూనావత్ రాములు, ఏఈలు పి.వెంకట్, ఉమాకాంత్, ఉద్యోగులు వెంకటేశ్వర్లు, గోపాల్రావు, రామకృష్ణ ఉన్నారు.