దిల్‌సుఖ్‌నగర్ పరిధిలో నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

హైదరాబాద్: నిర్వహణ పనుల దృష్ట్యా గురువారం పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని అస్మాన్ గఢ్ (సిటీ-8) విద్యుత్తు విభాగం అధికారులు పేర్కొన్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దిల్‌సుఖ్‌నగర్ ఫీడర్లో ఎస్బీహెచ్ ఆఫీసర్స్ కాలనీ, ఇందిరా నగర్, దిల్‌సుఖ్‌నగర్ డిపో, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు విద్యుత్ నిలిపివేత ఉంటుందని తెలిపారు.