సైబర్ మోసాలపై పోలీసుల హెచ్చరిక
AKP: సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతా నంబర్లు ఇచ్చి పరోక్షంగా సహకరిస్తున్న వారిపై పోలీసులు నిఘా పెట్టారు. జిల్లాలో ఇలాంటివి ఇప్పటివరకు 105 కేసులు నమోదైనట్లు వారు తెలిపారు. ఒకవేళ అనుమానాస్పద లావాదేవీలు జరుగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని SP తుహిన్‌సిన్హా తెలిపారు. 1930 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.