16 మంది మృతి.. తండ్రీకొడుకుల ఉగ్రరూపమే!
ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్‌లో జరిగిన ఉగ్రదాడి వెనుక తండ్రీకొడుకులు ఉన్నారని తేలింది. పండ్ల వ్యాపారి సాజిద్ అక్రమ్(50), అతని కొడుకు నవీద్(24) కాల్పులకు తెగబడ్డారు. యూదుల ఉత్సవం జరుగుతుండగా ఈ ఘాతుకానికి పాల్పడడంతో 16 మంది ప్రాణాలు కోల్పోగా, 38 మంది గాయపడ్డారు. పోలీసుల కాల్పుల్లో సాజిద్ మృతి చెందాడు. ఈ ఘటనతో సిడ్నీ ఉలిక్కిపడింది.