VIDEO: జాతీయ జెండా ఆవిష్కరణకు సన్నాహాలు

AKP: ఏజెన్సీ ముఖద్వారం అయిన నర్సీపట్నంలో మరో అరుదైన కలికితురాయి చోటుచేసుకుంది. క్షత్రియ సేవా సమితి సభ్యులు సొంత నిధులతో అల్లూరి సెంటర్ వద్ద 54 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించబోతున్నారు. ఆగస్టు 15 ఉదయం 9:30 గంటలకు జాతీయ జెండా ప్రజలకు అంకితం చేస్తున్నట్లు సభ్యులు పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడ లేని విధంగా 54 అడుగుల జాతీయ జెండా ఏర్పాటు చేస్తున్నామన్నారు.