పేకాట ఆడుతున్న ఏడుగురి అరెస్టు
హనుమకొండ జిల్లా కేంద్రంలో ఓ ఇంటిలో పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి విచారణ జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. కాజీపేట సీఐ సుధాకర్ రెడ్డి కధనం ప్రకారం మంగళవారం సిద్ధార్థ నగర్‌లో పేకాట ఆడుతున్నట్లుగా అందిన సమాచారం మేరకు ఆకస్మికంగా తనిఖీ చేసి వీరి వద్ద నుంచి నగదు తో పాటు ఏడు సెల్ ఫోన్లు స్వాధీన చేసుకున్నట్టు పేర్కొన్నారు.