VIDEO: ఒంటిమిట్టలో క్యూలైన్లు ఏర్పాటు
KDP: ఒంటిమిట్ట కోదండ రాముని బ్రహ్మోత్సవాలలో కళ్యాణం అతి పవిత్రమైనది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా కళ్యాణానికి భక్తులు ఒంటిమిట్టకు విచ్చేస్తారు. ఈ నేపథ్యంలో టీటీడీ అధికారులు ఆలయం నుంచి కళ్యాణ వేదిక వద్దకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్యూ లైన్ల వల్ల ఎండ నుంచి కూడా భక్తులకు ఉపశమనం కలుగుతుందని వారు తెలియజేశారు.