ఉపాధి హామీ పనులు పరిశీలించిన అదనపు కలెక్టర్
MNCL: జైపూర్ మండలంలోని కుందారం గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పనులను జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కార్మికులకు కల్పిస్తున్న సౌకర్యాలపై సమీక్షించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ద్వారా పొందుతున్న ప్రయోజనాల గురించి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు.