రంజాన్ పండుగ వేళ విషాదం

రంజాన్ పండుగ వేళ విషాదం

ATP: కనేకల్ మండలం సొల్లాపురం గ్రామంలో రంజాన్ పండుగ రోజున విషాదం చోటుచేసుకుంది. నమాజు చదివేందుకు మసీదుకు వెళ్లిన డ్రైవర్ లాల్ బాషా విద్యుత్ ఘాతంతో మృతి చెందారు. నమాజు చదువుకునే ముందు వుజూ చేసుకునేందుకు నీళ్లు తీసుకుంటుండగా నీటి తొట్టిలో విద్యుత్ వైర్ తెగి పడింది. ఈ విషయాన్ని లాల్ బాషా గమనించకపోవడంతో ప్రమాదం జరిగింది.