సబ్ జైలును తనిఖీ చేసిన జూనియర్ సివిల్ జడ్జి
SKLM: నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక సబ్ జైలును జూనియర్ సివిల్ జడ్జి ఎస్ వాణి మంగళవారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జైలు పరిసరాలను పరిశీలించి, జైలులో ఉన్న ఆరుగురు ముద్దాయిలను వారి కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. బెయిలు కోసం ఇబ్బంది పడుతున్న వారికి ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.