రవీంద్రభారతిలో విద్యార్థికి అభినందన

మెదక్: అమీన్‌పూర్ ప్రాంతానికి చెందిన నివేదిత గత కొద్ది రోజుల క్రితం రాణి రుద్రమదేవి ఏకపాత్రాభినయం కార్యక్రమాన్ని సంస్కార భారతీ ఆర్గనైజేషన్‌లో చేపట్టింది. ఆదివారం రవీంద్రభారతిలో జరిగిన ఓ కార్యక్రమంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డా. హరికృష్ణ నివేదితను అభినందిస్తూ, రాణి రుద్రమదేవి వేషాధారణలో ఉన్న ఆమె చిత్రపటం ఫోటో ఫ్రేమ్‌ని బహూకరించి అభినందించారు.