కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డుపై అభిషేక్ కన్ను

కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డుపై అభిషేక్ కన్ను

భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ.. కోహ్లీ పేరిట ఉన్న ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. T20ల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక రన్స్ చేసిన భారత ఆటగాడిగా కోహ్లీ కొనసాగుతున్నాడు. కింగ్ 2016లో 1614(4 సెంచరీలు) రన్స్ చేయగా.. అభిషేక్ ఈ ఏడాదిలో ఇప్పటివరకు 1533(3 సెంచరీలు) సాధించాడు. ఈ క్రమంలో సౌతాఫ్రికాతో మిగతా 3 T20ల్లో అభిషేక్ మరో 82 రన్స్ చేస్తే కోహ్లీ రికార్డు అతని సొంతమవుతుంది.