సర్వీస్ రోడ్డును పరిశీలించిన ఏసీపీ

RR: హిమాయత్ సాగర్ జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో మూడు గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ సందర్భంగా రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఏసీపీ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 17 వద్ద మూసివేసిన రోడ్డును సోమవారం సందర్శించారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటించి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణించాలన్నారు.