ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
ELR: రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, ఏపీ ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు అన్నారు. సోమవారం భీమడోలు మండలం గుండుగొలనులోని రైతు సేవా కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారు ప్రారంభించారు. సేకరించిన ధాన్యం లోడు లారీని జెండా ఊపి ప్రారంభించి, రైతులకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామన్నారు.