'పెన్షన్ రివెరిఫికేషన్‌లో మార్పులు తీసుకురావాలి'

సత్యసాయి: పెనుకొండ మండలంలో రీ వెరిఫికేషన్ పేరిట పెన్షన్ తొలగించిన దివ్యాంగులకు పెన్షన్ వచ్చే విధంగా చర్యలు తీసుకావాలని బహుజన చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు శివరామకృష్ణ కోరారు. పెనుకొండలో ఆర్డీవో ఆనంద్ కుమార్‌కు ఆదివారం ఆయన వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం రివెరిఫికేషన్ విధానంలో మార్పులు తీసుకుని నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరారు.