VIDEO: సీఐటీయూ రాష్ట్ర మహాసభల పోస్టర్ల ఆవిష్కరణ
NDL: సీఐటీయూ 17వ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఏప్రిల్ 17న నంద్యాల పట్టణంలో నిర్వహించనున్న కార్మిక మహా ప్రదర్శన, బహిరంగ సభను జయప్రదం చేయాలని CITU జిల్లా న్యూ సిటీ కమిటీ నాయకులు పిలుపునిచ్చారు. దీనికి సంబంధించిన పోస్టర్లను ఇవాళ ఆవిష్కరించారు. పార్టీ నాయకులు మాట్లాడుతూ.. ఈనెల 17న ఉదయం 10 గంటలకు కార్మిక మహా ప్రదర్శన, 11 గంటలకు బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.