వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ

వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ

BPT: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణా నది పరివాహక ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి సోమవారం స్వయంగా పర్యటించారు. కొల్లూరు, భట్టిప్రోలు కల్వర్టులపై నుండి వరద నీరు ప్రవహిస్తున్న ప్రదేశాలను పరిశీలించారు.