VIDEO: నలుగురిని కాపాడిన NDRF బృందాలు

VIDEO: నలుగురిని కాపాడిన NDRF బృందాలు

MLG: వరదలో చిక్కుకున్న నలుగురిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కాపాడిన ఘటన తాడ్వాయి మండలంలో జరిగింది. కాల్వపల్లి గ్రామంలో పశువులను మేతకు తీసుకెళ్లిన నలుగురు వాగు ప్రవాహం పెరగడంతో అక్కడే ఉండిపోయారు. దీంతో కుటుంబ సభ్యుల ద్వారా సమాచారం తెలుసుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సోమవారం రాత్రి తాడు సహాయంతో వాగు దాటి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.