సింగరేణి సామాగ్రి పట్టుకున్న విజిలెన్స్ అధికారులు

BDK: మణుగూరు పట్టణంలోని ఓ స్క్రాప్ షాప్‌లో అక్రమంగా దాచిన సింగరేణి సంస్థకు చెందిన విలువైన సామాగ్రిని గురువారం విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. విశ్వసనీయమైన సమాచారం మేరకు స్క్రాప్ షాప్‌పై దాడులు నిర్వహించిన విజిలెన్స్ బృందం, అక్కడ పెద్ద ఎత్తున సామాగ్రిని గుర్తించింది. ఈ ఘటనపై షాప్ యజమానిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.