మంత్రి సహకారంతో అభివృద్ధి చేస్తున్నాం: విజయమ్మ

NLR: మంత్రి నారాయణ సహకారంతో జిల్లాలో మూడో డివిజన్ అభివృద్ధి చేస్తున్నట్టు టీడీపీ నేత విజయమ్మ తెలిపారు. ప్రశాంతి నగర్ ప్రాంతంలోని చేపల మార్కెట్ మరమ్మతు పనులు, సింహపురి కాలనీ పార్కు ప్రాంతంలో నూతన రోడ్లు ప్యాచ్ వర్క్‌లను బుధవారం ప్రారంభించారు. డివిజన్‌లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయన్నారు.