హోటల్ సీజ్ ఎత్తివేత

NRML: జిల్లాలోని గ్రిల్ 9 హోటల్ ఆహార భద్రత నియమాలు పాటించకపోవడం, కల్తీ ఆహారం సరఫరా చేయడంతో గత సంవత్సరం నవంబర్ 5 న 20 మంది అస్వస్థతకు గురై, ఒకరు మృతి చెందారు. దీంతో అదే సంవత్సరం నవంబర్ 7న హోటల్‌ను సీజ్ చేశారు. హోటల్ యజమాని మంచాల లక్ష్మి హైకోర్టు ఉత్తర్వులతో సీజ్ ఎత్తివేయించారు. సోమవారం మున్సిపల్ కమిషనర్ ఆదేశాలతో హోటల్‌ను సానిటరీ ఇన్‌స్పెక్టర్ తెరిచారు.