VIDEO: కియా పరిశ్రమను సందర్శించిన ఎంపీ కలిశెట్టి

సత్యసాయి: పెనుకొండ సమీపంలో ఉన్న కియా పరిశ్రమను విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు విజనరీకి ఈ పరిశ్రమ నిదర్శనమని అన్నారు. కియా సమీపంలోని గ్రామాలన్నీ బాగా అభివృద్ధి చెందాయని తెలిపారు. కొందరు ప్రజలు తమ ఇళ్లలో చంద్రబాబు ఫొటోను పెట్టుకున్నారని పేర్కొన్నారు.