నేటి నుండి బ్రహ్మోత్సవాలు

నేటి నుండి బ్రహ్మోత్సవాలు

KDP: పులివెందులలో రంగనాథస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయని ఆలయ ఛైర్మన్ సుధాకర్ రెడ్డి, ఈవో రమణలు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారు రోజుకొక వాహనంపై దర్శనమివ్వనున్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి స్వామివారి ఉత్సవాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు.