పెనడలో ముమ్మరంగా వాహన తనిఖీలు
కృష్ణా జిల్లా వ్యాప్తంగా విజిబుల్ పోలీసింగ్ పేరుతో పోలీస్ అధికారులు ముమ్మర వాహన తనిఖీలు నిర్వహించారు. అయితే సోమవారం రాత్రి పెనడలో జరిగిన తనిఖీల్లో భాగంగా అన్ని రకాల వాహనాలను ఆపి డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్, ఇన్సూరెన్స్ వంటి కీలక పత్రాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. రోడ్డు ప్రమాదాలను నివారించడమే ప్రధాన లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు.