నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
ADB: తలమడుగు మండలంలోని బరంపూర్ సబ్ స్టేషన్ పరిధిలో బుధవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. సబ్ స్టేషన్‌లో అత్యవసర మరమ్మతుల కారణంగా మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ నిలిపివేయనున్నట్లు తలమడుగు TGNPDCL అసిస్టెంట్ ఇంజినీర్ తెలిపారు. ఈ మేరకు వినియోగదారులు సహకరించాలని కోరారు.