ఆధ్వానంగా మారిన అంకోలి సీసీ రోడ్లు

ఆధ్వానంగా మారిన అంకోలి సీసీ రోడ్లు

ADB: ఆదిలాబాద్ మండలం అంకోలి గ్రామంలో అంతర్గత రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. రోడ్లన్నీ గుంతలమయంగా మారి, కంకర తేలి ఉండటంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం నడవడానికి కూడా వీలులేని పరిస్థితి నెలకొందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదని, ఇప్పటికైనా స్పందించలన్నారు.